మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఈనాడు, అమరావతి: అమ్మాయిల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందిస్తున్న ఉపకారవేతనాలపై డ్వాక్రా మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను సెర్ప్‌శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే ప్రతి విద్యార్థినీ దరఖాస్తు చేసుకునేలా వెలుగు సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ఆయన అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఉపకార వేతనాలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ‘ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థినికీ రూ.30 వేలు ఉపకారవేతనం అందుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ/డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థినులకు ఈ పథకం వర్తిసుంది. ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉండాలి’ అని మంత్రి వివరించారు. ఈ ఉపకారవేతనం.. కోర్సుకు అనుగుణంగా రెండు నుంచి ఐదేళ్ల వరకు కొనసాగుతుంది. తొలి విడతగా ఈ నెల 31వ తేదీ వరకు, రెండో విడతలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.













Leave a Reply