
ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి (Stock Market Today). మరోసారి పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, చమురు ధరలు భగ్గుమనడంతో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి.
ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి.. 76,262 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 232 పాయింట్లు కోల్పోయి.. 23,823 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ , విప్రో, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97గా ఉంది.
చమురు మంటలు..
నెలరోజుల గ్యాప్ తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. హర్మూజ్‌పై పట్టుకోసం ఇరాన్, అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి (Crude oil prices). బ్రెంట్ క్రూడ్ ప్యూచర్స్ ఒక బ్యారెల్‌కు 95.52 డాలర్లుగా ఉండగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.













Leave a Reply