‘పులిచొక్కా వేసుకున్న గుంటనక్కవి నువ్వు’.. బిగ్‌బాస్‌లో రచ్చే రచ్చ.. | Bigg Boss 10 Telugu Day 30 Promos


Bigg Boss 10 Telugu Day 30 Promos

బిగ్‌బాస్‌ ఇంట్లో ఐదో వారం నామినేషన్స్‌ ప్రక్రియను కాస్త కొత్తగా నిర్వహించారు. ఈసారి అందరికీ ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేసే అవకాశం ఇవ్వలేదు. టాస్క్‌లో గెలిచిన వారికి మాత్రమే ఇద్దరిని నామినేట్ చేసే పవర్‌ దక్కేలా నామినేషన్స్‌ ప్రక్రియను రూపొందించారు.ఈ టాస్క్‌లో భాగంగా ఓ కంటెస్టెంట్‌ను పిలిచిన బిగ్‌బాస్‌.. గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఓ పండును దాచిపెట్టాలని సూచించాడు. ఆ పండును ఎవరు ముందుగా కనిపెడితే వారికి ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్‌ చేసే అవకాశం లభిస్తుంది.

రోహిత్‌ వర్సెస్‌ సుధీర్‌..
తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం చరణ్‌, సుధీర్‌ ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. అయితే సుధీర్‌ పండును కనిపెట్టి ఇద్దరిని నామినేట్‌ చేసే పవర్‌ సొంతం చేసుకున్నాడు. తన నామినేషన్స్‌లో భాగంగా సుధీర్‌ ముందుగా రోహిత్‌ను ఎంపిక చేశాడు. రోహిత్‌ మాట్లాడే సమయంలో టంగ్‌ స్లిప్‌ అయ్యాడని, కొన్ని సందర్భాల్లో మర్యాద తప్పినట్లు అనిపించిందని తన నామినేషన్‌ కారణాలను చెప్పాడు. అయితే సుధీర్‌ చేసిన వ్యాఖ్యలపై రోహిత్‌ వెంటనే స్పందించాడు. ‘కొన్ని మాటలు వదిలాడు’ అని సుధీర్‌ చెప్పడంతో.. ఆ మాటలు ఏంటో కూడా చెప్పాలని రోహిత్‌ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ప్రోమోలో కనిపించింది.

అపూర్వ వర్సెస్‌ ముకేష్‌..
ఇక మరోవైపు అపూర్వ తన నామినేషన్‌లో ముకేష్‌ను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ముకేష్‌ను ఉద్దేశించి ‘పులిచొక్కా వేసుకున్న గుంటనక్క’ అంటూ అపూర్వ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనికి ముకేష్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చాడు. ‘నక్క అయినప్పుడు నాతో ఎందుకు ఫ్లర్ట్‌ చేశావు? ఈ గుంటనక్క దగ్గరకు ఎందుకు వచ్చావు?’ అంటూ అపూర్వను ప్రశ్నించాడు. అంతేకాదు.. తన దగ్గర డ్యాగర్స్‌ పెట్టుకుంటే అపూర్వ తన దగ్గరకు వస్తుందని, తనతో ఫ్లర్ట్‌ చేస్తుందని ముకేష్‌ భావించాడని అపూర్వ ఆరోపించింది. దీంతో వీరిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపిస్తోంది.

ఇదీ చదవండి: ‘ఎవరికోసమో నేను మారలేను’.. రష్మిక స్ట్రాంగ్‌ రిప్లై

ఝాన్సీకి మరోసారి టార్గెట్‌..
ఇక ఝాన్సీ కూడా నామినేషన్స్‌లో తనపై వచ్చిన విమర్శలకు గట్టిగానే బదులిచ్చింది. తన ఆట దెబ్బతిని ఉంటే మూడు సార్లు కెప్టెన్సీ కంటెండర్‌గా ఎలా నిలుస్తానని ప్రశ్నించింది. అంతేకాదు.. అందులో రెండు సార్లు టాప్‌-2లోకి వచ్చానని గుర్తుచేసింది.

చరణ్‌పై నరేష్‌ కామెంట్స్‌..
మరోవైపు చరణ్‌ను నరేష్‌ నామినేట్‌ చేసినట్లు ప్రోమోలో కనిపించింది. ‘హోస్ట్‌ నీ గురించి చెప్పినప్పుడల్లా ఏదో పొడిచేస్తావ్‌ అనుకుంటాం. కానీ నువ్వేం పొడవలేకపోతున్నావ్‌ ’ అంటూ నరేష్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీనికి చరణ్‌ కూడా గట్టిగానే స్పందించాడు. ‘చరణ్‌ ఏం చేస్తున్నాడు.. ఏం చేయడం లేదు అనేది నన్‌ ఆఫ్‌ యువర్‌ బిజినెస్‌’ అంటూ కౌంటర్‌ ఇచ్చాడు.

మొత్తానికి ఐదో వారం నామినేషన్స్‌లో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగినట్లు తాజా ప్రోమోలు చూస్తే తెలుస్తోంది. పూర్తి ఎపిసోడ్‌లో ఈ గొడవలు ఏ స్థాయికి చేరతాయో చూడాలి.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *