జగనన్న కాలనీలో పర్యటన – Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana


మౌలిక సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలోని జగనన్న కాలనీలో ఎమ్మెల్యే ఉదయాన్నే పర్యటించారు. కాలనీ నివాసితులతో నేరుగా మాట్లాడి తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, డ్రైనేజీ, జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో నాయకులు తమను, కాలనీలోని సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే అధికారులతో చర్చించి, త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *