Weather: తెలంగాణలో మండుతున్న ఎండలు | heavy-heat-conditions-in-telangana


హైదరాబాద్‌: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్‌లో 37, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్ర్కమణ ప్రారంభమైంది. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతుండగా, రేపటికల్లా రాష్ట్రం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *