ఇంగ్లాండ్‌పై పాక్‌ సంచలన విజయం | general


షాదాబ్, రవూఫ్‌ గెలుపు సంబరం

లాహోర్‌: 154/9. ఇంగ్లాండ్‌పై 242 పరుగుల ఛేదనలో ఒక దశలో పాకిస్థాన్‌ స్కోరిది. ఈ స్థితి నుంచి ఏ జట్టయినా గెలుస్తుందని ఊహించగలమా. కానీ ఆదివారం పాక్‌ అద్భుతమే చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాదాబ్‌ ఖాన్‌ (113 నాటౌట్‌; 96 బంతుల్లో 13×4, 5×6) సంచలన ఇన్నింగ్స్‌ ఆడటంతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై ఒక్క వికెట్‌ తేడాతో గెలిచి, ఫైనల్లో ప్రవేశించింది. రవూఫ్‌ (7 నాటౌట్‌) అతడికి సహకరించాడు. ఛేదనలో పాక్‌ తడబడింది. ఆరంభం నుంచీ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు.. 103కే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో 3 వికెట్లు కూడా త్వరగానే పడ్డా.. షాదాబ్‌ పోరాడాడు. రవూఫ్‌తో కలిసి ఆఖరి వికెట్‌కు 89 పరుగులు జోడించి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. మొదట ఇంగ్లాండ్‌ 46.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. డకెట్‌ (105) సెంచరీ చేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *