
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా అఫ్గానిస్థాన్ (AFG vs IND) టీ20 సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 13, 15, 17వ తేదీల్లో దిల్లీ వేదికగా మూడు టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం సోమవారం అఫ్గానిస్థాన్ సెలక్షన్ కమిటీ 15 మందితో జట్టును ప్రకటించింది. ముగ్గురు ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసింది. ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అఫ్గానిస్థాన్ పూర్తిస్థాయి టీ20 సారథిగా అతనికిది తొలి సిరీస్. భుజం గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్‌బౌలర్ నవీనుల్ హక్ తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
భారత్‌తో మూడు టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), నూర్ రెహమాన్ (వికెట్‌కీపర్), సెదిఖుల్లా అటల్, డార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ముజీబుర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, నవీనుల్ హక్.
రిజర్వ్ ఆటగాళ్లు: ఇజాజ్ అహ్మద్‌జాయ్, షాహిదుల్లా కమల్, ఫరీద్ అహ్మద్ మాలిక్.














Leave a Reply