పాక్, శ్రీలంకకు ఐసీసీ భారీ షాక్ | Pakistan, Sri Lanka Charged By ICC After 1st ODI Of Tri Series 2026


Pakistan, Sri Lanka Charged By ICC After 1st ODI Of Tri Series 2026

source: X

పాకిస్తాన్, శ్రీలంక జట్లకు ఐసీసీ భారీ షాకిచ్చింది. వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌తో బౌలింగ్‌ చేసినందుకు చర్యలు తీసుకుంది. పాక్‌ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం, శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించింది. పాక్‌ నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేయగా.. శ్రీలంక ఒక ఓవర్ వెనుకబడింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లకు జరిమానా విధించారు.

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో వేయలేకపోయిన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఇరు జట్ల కెప్టెన్లు తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది.

పాక్ ఘన విజయం
స్వదేశంలో జరుగుతున్న ట్రై సిరీస్‌ను పాక్‌ విజయంతో ప్రారంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 305 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక 268 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్‌ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సల్మాన్ ఆఘా తన వన్డే కెరీర్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి పాక్‌ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. బౌలింగ్‌లో కెప్టెన్ షాహీన్ అఫ్రిదీ మూడు వికెట్లు పడగొట్టగా.. హారిస్ రవూఫ్, నసీమ్ షా, ఫహీమ్ అష్రఫ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఇదీ చదవండి: రషీద్‌ మాయాజాలం.. ఆఫ్ఘనిస్తాన్‌ ఘన విజయం

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *