
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఆమెపై వేటు వేయడానికి అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలుస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఇప్పటికే ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకపోతే మంత్రివర్గం నుంచి తొలగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. దిల్లీలో మంగళ, బుధవారాల్లో కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ముఖ్యనేతలు జరిపిన చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇతర సీనియర్ నేతల నుంచి ఇప్పటికే అధిష్ఠానం అభిప్రాయాలు తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.














Leave a Reply