Actor Shivaji OTT Platforms Controversy Comments,‘ఓటీటీలు సోమరిపోతుల కోసమే’… సోషల్‌మీడియాలో రచ్చ లేపుతోన్న శివాజీ కామెంట్స్ – ott is only for lazy people actor shivaji sparks debate over theater footfalls


కొన్ని సంవత్సరాల క్రితం కొత్త సినిమాలంటే కేవలం థియేటర్లలో మాత్రమే చూడాల్సి వచ్చేది. థియేటర్ రన్ ముగిశాక పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో ఆ చిత్రాల్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేస్తే అక్కడా జనాలు ఎగబడి చూసేశారు. అయితే ఎప్పుడైతే ఓటీటీలు రంగ ప్రవేశం చేశాయో ప్రేక్షకులు సినిమా చూసే విధానమే మారిపోయింది. ముఖ్యంగా కరోనా విపత్తు కారణంగా జనాలు ఓటీటీలకు అడిక్ట్ అయిపోయారనే చెప్పాలి. లాక్‌డౌన్‌లో వినోదం కోసం అందరూ ఓటీటీలనే ఆశ్రయించడంతో ఆ మార్కెట్‌ ఊహించని రీతిలో పెరిగిపోయింది. ఈ దెబ్బకి ఇప్పుడు ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సినిమా అయినా సరే నాలుగు వారాలు గడిచేసరికి ఓటీటీలోకి వచ్చే పరిస్థితి నెలకొంది. దీనిపై కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఆడియన్స్ టేస్ట్‌కి తగినట్లుగా ఇండస్ట్రీలో మారడంలో తప్పులేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు శివాజీ తాజాగా ఓటీటీ ప్రేక్షకులపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. సెప్టెంబర్ 11న వెండితెరపైకి రానున్న ఈ సినిమాలో శివాజీ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడిన ఆయన నేటి ప్రేక్షకుల ఆలోచనా విధానంపై అసహనం వ్యక్తం చేశారు. ఓటీటీలు కేవలం సోమరిపోతుల కోసమేనని, థియేటర్లలో దక్కే అసలైన ఎక్స్‌పీరియన్స్‌ని ఇవి హరిస్తున్నాయని శివాజీ అభిప్రాయపడ్డారు.

* భయపెడుతూనే నవ్వించనున్న రవితేజ… తొలిసారి ‘హారర్ కామెడీ’ బాటలో మాస్ మహారాజా

శివాజీ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌కు సరికొత్త ఊపిరిలూదిన వెబ్ సిరీస్ ‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’. ఆదిత్య హాసన్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ డిజిటల్ వేదికపై ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్‌ను నేరుగా థియేటర్లలో విడుదల చేసి ఉంటే బాక్సాఫీస్ వద్ద అలవోకగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఓటీటీకి పరిమితం కావడం వల్ల ఒక భారీ స్థాయి కలెక్షన్ల రికార్డును వెండితెర మిస్సయిందని, మంచి కథలకు థియేటర్లలో దక్కే రెస్పాన్స్ ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

శివాజీ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్‌పై నెట్టింట భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా హాలుకు వెళ్లి ఒక సమూహంతో కలిసి వెండితెరపై చిత్రాన్ని చూడటంలో ఉండే ఎమోషన్ ఓటీటీలో ఎప్పటికీ దొరకదని, థియేటర్ వ్యవస్థను కాపాడుకోవాలనే భావనతోనే శివాజీ అంత కఠినంగా మాట్లాడారని పలువురు సినీ ప్రియులు సమర్థిస్తున్నారు. బిగ్ స్క్రీన్ అనుభవాన్ని ప్రమోట్ చేయడంలో తప్పులేదని వారు భావిస్తున్నారు. అయితే మరోవర్గం ఆయన కామెంట్స్‌ని తప్పబడుతున్నారు. పెరిగిన టికెట్ రేట్లు, పాప్‌కార్న్ ధరలు, కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్తే అయ్యే భారీ ఖర్చులు సామాన్యుడికి భారంగా మారాయని, పని ఒత్తిడిలో బతికే కుటుంబాలకు ఇంట్లోనే నాణ్యమైన వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని కొందరు అంటున్నారు. సినిమాని ఎక్కడ చూడాలన్నది పూర్తిగా ప్రేక్షకుల అభిరుచికి సంబంధించినదని, అలాంటిది ఓటీటీ చూసేవాళ్లని సోమరిపోతులుగా అభివర్ణించడం శివాజీ మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపడుతున్నారు.

వీరేష్ బిళ్ళ

రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్‌ స్టైల్ కథనాలు రాశారు. ఆయనకు హైపర్ లోకల్ న్యూస్ రాసిన అనుభవంతో పాటు వీడియో టీమ్ కోసం పని చేసిన అనుభవం కూడా ఉంది. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. వీరేశ్ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. గతంలో ఈనాడు.నెట్‌లో 7 ఏళ్లు పనిచేసిన ఆయన సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఆరేళ్లు సేవలందించారు. ప్రస్తుతం ‘సమయం తెలుగు’లోనే కన్సల్టెంట్‌‌గా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో ప్రకృతిలో సేద దీరడం, పుస్తకాలు చదవడం, పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుంటారు.ఇంకా చదవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *