Weather Report: రుతుపవనాల తిరోగమనం.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | Monsoon Withdrawal: Dry Weather and High Temps Predicted for Telugu States


బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగురాష్ట్రాల్లో గడిచిన వారంలో రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవి ఈ వర్షాల కాలంలో వానలు లేక అల్లాడుతున్న రైతులకు కాస్త ఊరనిచ్చాయి. కానీ ఇకపై మళ్లీ వర్షాలు కరువై భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవాకశం ఉందని.. తెలంగాణ వెదర్‌మ్యాన్ పేర్కొన్నారు. రుతుపవణాల తిరోగమనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో పొడివాతావరణం ఉండే ఛాన్స్ ఉందని తెలిపారు.

తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం.. తెలుగురాష్ట్రాల నంచి రుతుపవనాల తిరోగమనం మొదలైందని.. దాని ప్రభావంతో నేటి నుంచి వేడి వాతావరణం మరింత పెరిగి, చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 34-35°C దాటే ఛాన్స్ ఉందని తెలిపారు. మార్నింగ్ టైంలో వాతావరణం సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. అయితే సెప్టెంబర్ 29న మాత్రం కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని.. మిగిలిన జిల్లాల్లో పొడి వాతవరణం ఉంటుందని తెలిపారు.

అలాగే ప్రస్తుతం వీస్తున్న గాలుల దిశ మార్పు కారణంగా వచ్చే తూర్పు గాలుల ప్రభావంతో ఆగ్నేయ తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలోని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని. మిగత జిల్లాలో వాతావరణం పొడిగానే ఉందని పేర్కొన్నారు. మొత్తానికి ప్రస్తుతం తెలంగాణలో పొడి వాతవరణమే ఉంటుందని.. సరైన తేమతో కూడిన ఈశాన్య రుతుపవనాలు వీచే వరకు సరైన వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు. అటు ఏపీలోనూ ఇదే తరహా వాతవరణ ఉండే చాన్స్ ఉందని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *