Karthika Deepam Serial Today Episode: జ్యోత్స్న సూరజ్‌కి పీఏగా రావడాన్ని సహించలేకపోతుంది మాలిని. ఏదో విధంగా ఆమెను అక్కడ నుంచి పంపేయాలని ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆమె ప్రయత్నానికి అడ్డుకట్ట వేశాడు సూరజ్. ఆమెను ఆపాలని చూస్తే.. ఈసారి ఆఫీస్‌కి కాదు.. ఈ ఇంట్లో అడుగుపెడుతుంది అని మాలినిని హెచ్చరిస్తాడు సూరజ్. ఆ వివరాలతో నేటి (అక్టోబర్ 07) ఎపిసోడ్‌లో ఏమైందో చూద్దాం.

అదే జరిగితే ఈ ఇంట్లో నేను ఉండను..
ఇన్నాళ్లకి నాకు ఆ అవకాశం వచ్చింది. జ్యోత్స్న వల్ల సుమిత్ర కూడా ఈ ఇంట్లో అడుగుపెడుతుందనే నమ్మకం ఉంది.. కొడుకుని పోగొట్టుకుని నా మనవడి రూపంలో చూసుకుంటున్నా. నా కూతురు తిరిగి వస్తుందనే ఆశ మనవరాలి రూపంలో కనిపిస్తుంది. దీన్ని ఎవరూ అడ్డుకోవద్దు.. అలా చేయాలనుకుంటే.. నేను ఈ ఇంట్లో ఉండను. నేను ఇక్కడ ఉండాలంటే నా నిర్ణయం ప్రకారం జరగాల్సిందే. లేదంటే ఈ ఇంట్లో మీరు మాత్రమే ఉంటారు’’ అని చెప్పేసి వెళ్లిపోతాడు దక్షిణమూర్తి. ‘నువ్వేం మాట్లాడవేంట్రా అని సూరజ్‌ని అడుగుతుంది మాలిని. ‘తాత చేసేది సరైనదే అయినప్పుడు మనం మాట్లాడటం ఎందుకమ్మా’ అని అనేసి వెళ్లిపోతాడు సూరజ్. దాంతో బిత్తరపోతుంది మాలిని.
జ్యోత్స్నకి ఏమైందీ??
రాత్రి అయినా జ్యోత్స్న ఇంటికి రాకపోవడంతో ఇంట్లో కంగారు అవుతుంటారు. ఇంతలో దీప, కార్తీక్‌లు వస్తారు. జ్యోత్స్న రాలేదా? మాతో పాటే బయల్దేరిందే.. అని నోరు జారేస్తుంది దీప. దాంతో సుమిత్ర, దశరథ్‌లకు అనుమానం వస్తుంది. మీతో బయల్దేరడం ఏంటి? మీరు పని చేసింది మాలిని దగ్గర కదా.. మీతో ఎందుకు బయల్దేరుతుంది? అని ప్రశ్నలు కురిపిస్తారు. ఇక కార్తీక్.. అతి కష్టంపై వాళ్ల నుంచి తప్పించుకుని.. దీపని పక్కకి తీసుకుని వచ్చి క్లాస్ పీకుతాడు. ఏది ఏమైనా సరే..జ్యోత్స్న పీఏ జాబ్ గురించి మన ఇంట్లో తెలియకూడదు. మాలిని పిన్ని చెప్పాలనుకుంటే చెప్పనియ్. ఆమె చెప్పాలనుకున్నా దక్షణమూర్తి తాత ఖచ్చితంగా అడ్డుకుంటాడు.. ఈలోపు మనమే ఆ నిజాన్ని చెప్పేసి ఇబ్బంది పడొద్దు’ అని అంటాడు.
నీ కూతురు నా కంపెనీలో..
మరోవైపు సుమిత్రకి కాల్ చేసిన మాలిని.. ‘మొత్తానికి నువ్వు అనుకున్నది నీ కూతురు ద్వారా సాధిస్తున్నావ్. . అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్.. నా కూతుర్ని అడ్డుపెట్టుకుని సాధించడం ఏంటి? అని అంటుంది సుమిత్ర. అబ్బా.. నాటకాలు బాగా ఆడుతున్నావ్ కదా.. ముందు దీప, కార్తీక్‌లను రంగంలోకి దిగారు. ఇప్పుడు నీ కూతుర్ని దింపావ్.. అని అంటుంది మాలిని. ‘నా కూతురు దిగడం ఏంటీ? అని సుమిత్ర అడగడంతో.. ‘నీ కూతురు జ్యోత్స్న నా కంపెనీలో అని నిజం చెప్పబోతుండగా.. సూరజ్ వచ్చి ఫోన్ లాగేసుకుంటాడు. కాల్ కట్ చేసేస్తాడు. సుమిత్ర మళ్లీ తిరిగి కాల్ చేసినా కూడా కట్ చేసేస్తాడు సూరజ్. తాత ఏం చెప్పాడు .. నువ్వేం చేస్తున్నావ్ అని మాలినిని నిలదీస్తాడు సూరజ్.
మళ్లీ తప్పు చేయొద్దు..
అంటే నేను తప్పు చేస్తున్నానా? అని మాలిని అడగడంతో.. ఆల్రెడీ చేశావ్.. మరో తప్పు చేయొద్దు’ అని హెచ్చరిస్తాడు సూరజ్. నేను తప్పు చేయడం ఏంట్రా అని మాలిని అడగడంతో.. ‘కేప్‌లో జ్యోత్స్న జాబ్ పోవడానికి కారణం నువ్వే.. నిన్ను అడిగినా కూడా నాకు నిజం చెప్పలేదు’ అని అంటాడు. ‘అవునురా చెప్పలేదు. మీ తాత మనవరాలు కేప్‌లో జాబు చేయడం నాకు ఇష్టం లేదు’ అని మాలిని ఇంకా ఏదో అనబోతుంది. ‘ఇంక చాలు ఆపమ్మా’ అని అరుస్తాడు సూరజ్. ‘నువ్వు వివరణ ఇచ్చేవరకూ నువ్వు చేసింది నాకు అర్థం కావడంలేదు అంటే.. నువ్వు తప్పు చేసినట్లే అమ్మ’ అంటాడు సూటిగా సూరజ్. బిత్తరపోతుంది మాలిని.
తాత మాటకి విలువేం ఉంచావ్..?
ఇక సూరజ్ అంతే కోపంగా.. ‘సరే నువ్వు అన్నదే కాసేపు నిజం అని అనుకున్నా.. సుమిత్ర అత్తకు మన కంపెనీలో జాయిన్ అయ్యింది అన్న నిజం తాత చెప్పొద్దు అన్నాడు.. మరి తాత మాటకు విలువ ఏముంది? తాతను అవమానించినట్లే కదా? ఇప్పుడు జ్యోత్స్న బాధ్యత మనది కాదు తాతది’ అంటాడు సూరజ్. ‘అంటే జ్యోత్స్న మన ఆఫీస్‌కి రావడం నీకు హ్యాపీనా?’ అంటుంది మాలనీ.‘అది నా ముఖంలో కనిపిస్తుందా?’ అంటాడు సూరజ్ కోపంగా. ‘మరి ఎందుకు నువ్వు సుమిత్ర గురించి ఆలోచిస్తున్నావ్?’ అంటుంది మాలిని. నేను ఆలోచించేది తాత గురించి.. అయినా జ్యోత్స్న ఆఫీస్‌లో అడుగుపెట్టడానికి కారణం తాత కాదు.. నువ్వే’ అని అంటాడు సూరజ్.
పైకి విసిశావ్.. నేరుగా నీ నెత్తిన పడింది..
నీకు నచ్చని వస్తువుని దూరంగా విసిరేయాలి కానీ.. పైకి విసిరావ్.. అది నేరుగా వచ్చి నీ నెత్తినే పడింది. నువ్వు జ్యోత్స్నని అడ్డుకోవాలని అనుకున్నావ్.. తను వచ్చి మన ముందే నిలబడింది. ఇది ఇక్కడితో ఆగదు. జ్యోత్స్న విషయంలో మనమేం చేయలేం. జ్యోత్స్నని అలా వదిలెయ్ అని అంటాడు సూరజ్. అంటే నువ్వు నీ కన్న తల్లిని నమ్మడం లేదు కదా అని అంటుంది మాలిని. దానికి దీనికి సంబంధం లేదమ్మా..అని అంటాడు. ‘లేదు.. నిన్ను చూస్తుంటే నీ తండ్రి చావు విషయంలో నాదే తప్పు అనేలా ఉన్నావ్.. నాకు సమాధానం చెప్పి వెళ్లు తప్పు నాదే అని నువ్వు నమ్ముతున్నావా? అని అంటుంది మాలిని. నాకు తెలియని వాటి గురించి.. నేను చూడని వాటి గురించి నేను మాట్లాడనమ్మా.
జ్యోత్స్న ఇంట్లో అడుగుపెట్టేట్టు చేయొద్దమ్మా.. సూరజ్ హెచ్చరిక
అయినా నేను ఇదంతా చేసింది.. నాన్న చావుకి ప్రతీకారంగానే కదా.. జ్యోత్స్న విషయాన్ని దీనితో ముడిపెట్టొద్దు. నువ్వు నా తల్లివి. ఇది నిజం. నేను నీ కొడుకుని. ఇది కూడా నిజమే. నా విషయంలో నీకున్న అధికారం జ్యోత్స్న విషయంలో ఉండదు. జ్యోత్స్నని ఇప్పటికే రెచ్చగొట్టి.. ఆఫీస్ వరకూ వచ్చేట్టు చేశావ్.. ఇంకా రెచ్చగొట్టి ఇంటి వరకూ వచ్చేట్టు చేయొద్దు’ అని హెచ్చరిస్తాడు సూరజ్. బిత్తరపోయిన మాలిని.. ‘ఇంట్లోకి వచ్చేట్టు చేయొద్దన్నాడంటే.. జ్యోత్స్నని ఇంటికి తీసుకొస్తాననా? ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ.. నా కొడుకు మారిపోయాడని మాత్రం తెలుస్తుంది’ అని అనుకుంటుంది. అటు మాలిని నుంచి ఫోన్ రావడంతో.. జ్యోత్స్న ఎక్కడ జాబ్ చేస్తుంది.. మీకు తెలుసు.. ఎక్కడ జాబ్ చేస్తుందో చెప్పండి’ అని దీప, కార్తీక్‌లను నిలదీస్తారు. వాళ్లు అలవాటైన పద్దతిలో నిజాన్ని దాచేయడంతో నేటి ఎపిసోడ్ ముగిసింది.














Leave a Reply