ఈ మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో 2026 క్యాలెండర్ ఏడాదిలో అతను తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 39కి చేరింది. 2022లో ఐర్లాండ్ పేసర్ జాషువా లిటిల్ కూడా ఒకే ఏడాదిలో 39 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు అర్ష్దీప్ ఆ రికార్డును సమం చేసి, పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్న దేశాల బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.
2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి అర్ష్దీప్ సింగ్ భారత బౌలింగ్ దళంలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 102 టీ20 మ్యాచ్లు ఆడి 149 వికెట్లు పడగొట్టాడు. మరో వికెట్ తీస్తే 150 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా అర్ష్దీప్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి 4 వికెట్లు తీశాడు.












Leave a Reply