Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో క్రేజ్ | Varshini Sounderajan To Enter Bigg Boss Telugu 10


వర్షిణి సౌందరరాజన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త పరిచయం కాదు. యాంకర్‌గా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఆమె సినిమాల్లోనూ పలు పాత్రలు పోషించారు. చందమామ కథలు, లవర్స్, జోడి, మళ్లీ మొదలైంది, శాకుంతలం వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. మరోవైపు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగించారు. తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్లో ఇప్పటికే పరిచయం ఉన్న ముఖం కావడంతో బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలో ఆమె పాల్గొంటే ఆమెకు ఉన్న పాపులారిటీ ఉపయోగపడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *