Free Bus | మహిళల తర్వాత వృద్ధులకూ ఫ్రీ బస్సు.. తెలంగాణలో త్వరలో కొత్త పథకం?-Namasthe Telangana


Free Bus | ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. సీనియర్‌ సిటిజన్లకూ అదే తరహాలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది.


Free Bus | మహిళల తర్వాత వృద్ధులకూ ఫ్రీ బస్సు.. తెలంగాణలో త్వరలో కొత్త పథకం?

Free Bus | ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. సీనియర్‌ సిటిజన్లకూ అదే తరహాలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. వృద్ధుల నుంచి వస్తున్న అభ్యర్థనలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారవాణాపై వారికున్న ఆధారాన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో 25 శాతం రాయితీ

ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏసీ సర్వీసులతో పాటు అన్ని బస్సుల్లో టికెట్‌ చార్జీపై 25 శాతం రాయితీ అమలులో ఉంది. దీనికి భిన్నంగా తెలంగాణలో సీనియర్‌ సిటిజన్లకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే పల్లె వెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల వరకు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేయాలా? ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణాలకూ అవకాశం కల్పించాలా? అనే అంశాలపైనా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంటుంది.

ఆర్టీసీపై అదనపు భారం

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్న నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీపై ఇప్పటికే ఆర్థిక భారం ఉంది. ఈ నేపథ్యంలో వృద్ధులకూ ఉచిత ప్రయాణం కల్పిస్తే సంస్థపై మరింత భారం పడనుంది. సీనియర్‌ సిటిజన్ల ఉచిత ప్రయాణానికి అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేస్తుంది? ఎంత మొత్తాన్ని కేటాయించాల్సి వస్తుంది? అన్నది కీలకంగా మారనుంది. మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఆర్టీసీకి నిధులు చెల్లిస్తున్న తరహాలోనే వృద్ధుల ప్రయాణానికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది.

 

RELATED ARTICLES



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *