_10.webp)
Jio-Airtel-VI | ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ ధరలను పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రానున్న 3-6 నెలల్లో మొబైల్ టారిఫ్‌లు 10-15 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవల్ ప్లాన్‌లను తొలగించింది. మరో టెలికాం కంపెనీ జియో రూ.300తో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. ఈ సభ్యత్వం తీసుకుంటే ఏడాది పాటు టారిఫ్‌ల సవరణ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది. తద్వారా రెండు టెలికాం కంపెనీలు టారిఫ్‌ల సవరణ తప్పదనే సంకేతాలు ఇచ్చాయి. రీఛార్జ్ ధరలు పెరిగే ప్రమాదం ఉన్నందున టెలికాం కంపెనీలు అందిస్తున్న వార్షిక ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకుంటే ధరల పెంపు నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. 365 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్న ప్లాన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
జియో నుంచి రెండు ప్లాన్స్
- రూ.3,999 ప్రీపెయిడ్ ప్లాన్: రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్+ 100 ఎస్సెమ్మెస్‌లు. అర్హులైన సబ్‌స్క్రైబర్లకు అన్‌లిమిటెడ్ 5జీ సదుపాయం. జియో హట్‌స్టార్ ద్వారా మొబైల్+, హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్. 50 జీబీ స్టోరేజీతో జియో ఏఐ క్లౌడ్. జియో టీవీ, ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్ అదనం. 18 నెలల పాటు గూగుల్ జెమినై ప్రో ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. ప్రో ప్లాన్‌లో 5000 జీబీ క్లౌడ్ స్టోరేజీ ఉచితంగా లభిస్తుంది.
- రూ.3,599 ప్లాన్: రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు. జియోటీవీ ప్రో ప్యాక్ వోచర్, 120GB ఎక్స్‌ట్రా డేటా. 50GBతో కూడిన జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్. 18 నెలల పాటు గూగుల్ జెమినై ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
ఎయిర్‌టెల్ ప్లాన్స్
- రూ.3,599 ప్రీపెయిడ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు.
- రూ.3,999 ప్లాన్: రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు. 12 నెలల పాటు డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఈ రెండు ప్లాన్‌లు అర్హులైన వారికి 5జీ కనెక్టివిటీ సదుపాయం.
వొడాఫోన్ వార్షిక ప్లాన్లు
జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే వొడాఫోన్‌లో ఎక్కువ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
- రూ.1,849 ప్లాన్: అన్‌లిమిటెడ్ కాల్స్, 3,600 ఎస్సెమ్మెస్‌లు.
- రూ.2,249 ప్లాన్: 30GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 3,600 ఎస్సెమ్మెస్‌లు.
- రూ.3,599 ప్లాన్: రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు. హీరో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ ఇందులో లభిస్తాయి. వీకెండ్ డేటా రోల్ ఓవర్ (సోమ-శుక్రవారం మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకోవచ్చు). బింజ్ ఆల్‌నైట్ (12AM-6AM) అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా పొందొచ్చు.
- రూ.3,699: రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ సదుపాయం ఉంటుంది.
- రూ.3,799: రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్‌లతోపాటు అమెజాన్ ప్రైమ్ లైట్‌ను ఉచితం.
- రూ.3,999 ప్లాన్: 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్‌లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.
- రూ.4,999 ప్లాన్: 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, 200 ఎస్సెమ్మెస్‌లు. జియో హాట్‌స్టార్, సోనీలీవ్, అమెజాన్ ప్రైమ్ లైట్ వంటి 18 పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ.
- రూ.1,189 ప్లాన్: 365 రోజులకు 50 జీబీ డేటా.











Leave a Reply