‘ఒక్కసారి అన్నయ్యా ఎలా ఉన్నావ్ అంటే వినాలని ఉంది’.. బ్రహ్మానందం సోదరుడి ఆవేదన | Brahmanandam brother srividan emotional appeal for one phone call


హాస్యంతో కోట్లాది మంది ముఖాలపై నవ్వులు పూయించే ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఇంట్లో మాత్రం ఇప్పుడు ఓ విషాద ఛాయ కనిపిస్తోంది. ఆయన సొంత అన్నయ్య శ్రీవదన్ వృద్ధాప్యంలో తమ్ముడి ఆప్యాయత కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కుటుంబ బంధాలు, తోడబుట్టిన వారి ఆప్యాయత ఎంత విలువైనదో గుర్తుచేస్తున్న ఆయన మాటలు నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

ఆరుగురిలో నలుగురు దూరమయ్యారు..

తన కుటుంబ పరిస్థితిని గుర్తుచేసుకున్న శ్రీవదన్.. ‘మేము మొత్తం ఆరుగురం. ఇప్పటికే నలుగురు చనిపోయారు. మిగిలింది ఇద్దరమే. కానీ ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వయసు పైబడిన సమయంలో తోడబుట్టినవారి పలకరింపు, ఆప్యాయత ఎంత అవసరమో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇటీవల బ్రహ్మానందం సొంత ఊరికి వచ్చినప్పటికీ తనను కలవలేదని శ్రీవదన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తమ్ముడి నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

‘అన్నయ్యా.. ఎలా ఉన్నావ్?’ అంటే చాలు..

‘తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి.. ఏరా అన్నయ్యా.. ఎలా ఉన్నావ్? అని ఒక్క మాట అడుగుతాడేమోనని రోజూ ఎదురుచూస్తున్నా’ అంటూ శ్రీవదన్ చెప్పిన మాటలు హృదయాన్ని తాకుతున్నాయి. జీవితంలో ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా.. సొంతవారి నుంచి వచ్చే చిన్న పలకరింపుకు ఉన్న విలువ వేరని ఆయన వ్యాఖ్యానించారు.

‘సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు వచ్చి చిన్నవారిని పలకరిస్తే.. వారికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం’ అంటూ శ్రీవదన్ భావోద్వేగానికి లోనైనట్లు వీడియోలో కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ్ముడి నుంచి పెద్దగా ఏమీ ఆశించడం లేదని.. కేవలం ఆప్యాయంగా పలకరించి, ఎలా ఉన్నావని అడిగితే చాలని ఆయన కోరుకుంటున్నట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది.

అయితే.. అన్న శ్రీవదన్ మాటలు బ్రహ్మానందం వరకు చేరడంతో ఆయన స్పందించారు. తన సోదరుడు మెంటల్‌గా స్టేబుల్‌గా లేడని.. ఎవరో ఒక యూట్యూబర్ అలా మాట్లాడించినట్లు చెప్పుకొచ్చారు. తాను తన సోదరుడి ఫ్యామిలీకి చాలా సాయం చేశానని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *