4 రోజుల తర్వాత మళ్లీ లాభాలు


ఎఫ్‌ఐఐ విక్రయాలు: రూ.3,112 కోట్లు 

డీఐఐ కొనుగోళ్లు: రూ.8,930 కోట్లు

నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ సూచీలు శుక్రవారం బలంగా పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో లోహ, ప్రైవేట్‌ బ్యాంకులు, చమురు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 94.43 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.40% తగ్గి 95.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

  • బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1.17 లక్షల కోట్లు పెరిగి రూ.488.25 లక్షల కోట్ల (5.17 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. 
  • సెన్సెక్స్‌ ఉదయం 505 పాయింట్ల లాభం (క్రితం ముగింపు 76,152.86 పాయింట్లు)తో 76,657.02 వద్ద ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 76,883.14 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 362.57 పాయింట్ల లాభంతో 76,515.43 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.25 పాయింట్లు పెరిగి 23,897.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,895.85- 24,005.75 పాయింట్ల మధ్య చలించింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 లాభపడ్డాయి. టాటా స్టీల్‌ 2.91%, రిలయన్స్‌ 1.61%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.47%, ట్రెంట్‌ 1.34%, అదానీ పోర్ట్స్‌ 1.33%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.30%, కోటక్‌ బ్యాంక్‌ 1.15%, అల్ట్రాటెక్‌  1.11%, టైటన్‌ 1.01% రాణించాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 1.24%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.24%, ఎటర్నల్‌ 1.09% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. లోహ 1.42%, హౌసింగ్‌ ఫైనాన్స్‌ 1.41%, టెలికాం  1.39%, బీమా 1.37% మెరిశాయి. స్థిరాస్తి, యంత్ర పరికరాలు, వాహన, ఆరోగ్య సంరక్షణ, హాస్పిటల్స్, ఐటీ నిరాశపరిచాయి. బీఎస్‌ఈలో 2388 షేర్లు లాభపడగా, 1991 స్క్రిప్‌లు నష్టపోయాయి. 251 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
  • ఆస్టర్‌ డీఎం క్వాలిటీ కేర్‌ లిమిటెడ్‌లో ప్రమోటర్లయిన ఆజాద్‌ మూపెన్, ఆయన కుటుంబ సభ్యులు తమ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకున్నారు. దాదాపు రూ.350.34 కోట్లతో 0.57 శాతం వాటాలను కొనుగోలు చేశారు. దీంతో సంస్థలో వీరి మొత్తం వాటా 24.58 శాతానికి చేరింది.

ఐపీఓ సమాచారం

  • ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌ ఐపీఓ సెప్టెంబరు 9న ప్రారంభమై 11న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.139-146 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ427 కోట్లు సమీకరించనుంది.
  • కరంతారా ఇంజినీరింగ్‌ రూ.875 కోట్ల ఐపీఓ 9న ప్రారంభమై 11న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.241-254 నిర్ణయించారు. గరిష్ఠ ధర ప్రకారం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.8174 కోట్లుగా నమోదుకావొచ్చు.
  • రెంటోమోజో రూ.1256 కోట్ల ఐపీఓ 9న ప్రారంభమై 11న ముగియనుంది. ధరల శ్రేణి రూ.384-404.
  • మణిపాల్‌ పేమెంట్‌ అండ్‌ ఐడెంటిటీ సొల్యూషన్స్‌ రూ.805 కోట్ల ఐపీఓ 9న ప్రారంభమై 11న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.322-339 నిర్ణయించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *