Anam: స్వాతంత్ర్య వేడుకల్లో అస్వస్థతకు గురైన మంత్రి ఆనం


తిరుపతి: తిరుపతి పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు రాష్ట్ర  మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న సమయంలో కళ్లు తిరిగి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకున్నారు. సకాలంలో స్పందించిన వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.



Source link

Leave a Comment