Divyavani Missed Gharana Mogudu Movie Chance,వాళ్లకు నచ్చినట్లు ఉండలేకే ఆ ఛాన్స్ పోయింది: ‘ఘరానా మొగుడు’ మూవీపై దివ్యవాణి షాకింగ్ కామెంట్స్ – from missing chiranjeevi gharana mogudu to politics veteran actress divyavani opens up about her journey


తెలుగు సినీ ప్రేక్షకులకు నటి దివ్యవాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కనక్కర్లేదు. బాపు దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘ పెళ్లి పుస్తకం ’లో సత్యభామగా ఆమె కనబరిచిన అమాయకత్వం, అల్లరి, అభినయం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సీనియర్ నటి, తన సినీ ప్రయాణంలోని ఎత్తుపల్లాలు, స్టార్ హీరోల ప్రాజెక్టుల నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఎదురైన పరిస్థితులపై సంచలన విషయాలను బయటపెట్టారు.

* తారక్ – బన్నీ కాంబోలో నెల్సన్ భారీ మల్టీస్టారర్?… బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే ప్లాన్!

ఘరానా మొగుడు ఛాన్స్ ఎందుకు చేజారింది?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే భారీ మైలురాయిగా నిలిచిన ‘ఘరానా మొగుడు’ చిత్రంలో తనకు తొలుత అవకాశం వచ్చిందని దివ్యవాణి వెల్లడించారు. అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కాల్షీట్లు లేకపోవడమో, రూపం, ఎత్తు సమస్యలో కారణం కాదని స్పష్టం చేశారు. “ఆ ఛాన్స్ ఎందుకు మిస్సయ్యిందో పరిశ్రమలో అందరికీ తెలుసు.. వాళ్లు ఆశించిన రీతిలో, వాళ్లకు నచ్చినట్లు నేను ఉండకపోవడమే దానికి కారణం. దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు దాని గురించి మరీ ఎక్కువగా తవ్వి పోయడం అనవసరం” అంటూ పరోక్షంగా ఇండస్ట్రీలోని పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా బాపు-రమణల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ పెళ్లాం’లోనూ తనను హీరోయిన్‌గా తీసుకోవాలని దర్శకుడు భావించినప్పటికీ, హీరో అభ్యంతరం చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ చేజారిందని గుర్తుచేసుకున్నారు. అయితే తన స్థానంలో మరో నటికి మంచి లైఫ్ దక్కినందుకు సంతోషించానని ఆమె పరిణతితో చెప్పారు.

15వ ఏటనే సొంతంగా మేకప్

తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే అన్ని అంశాలపై దృష్టి పెట్టానని దివ్యవాణి చెప్పారు. ‘అడవిలో అర్ధరాత్రి’ చిత్రం సమయంలో సీనియర్ ఎన్టీఆర్‌కు వ్యక్తిగత మేకప్‌మెన్‌గా పనిచేసిన పీతాంబరం కుమారుడు గోపి వద్ద మెళకువలు గ్రహించి 15 ఏళ్ల ప్రాయం నుంచే తన పాత్రలకు తానే స్వయంగా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టానని తెలిపారు. అయితే కెరీర్ తొలినాళ్లలో ‘ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్లాం’ వంటి చిత్రాల సెట్స్‌లో కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురై కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని, ఆ సమయంలో తల్లి అందించిన మనోధైర్యమే తనను నిలబెట్టిందని వివరించారు.

* అనుపమ పరమేశ్వరన్ మనసులో ఇంత పెద్ద కోరిక ఉందా?.. పెళ్లి ముచ్చట్లపై క్రేజీ రియాక్షన్

రవితేజ తల్లిగా చేయాల్సింది.. కానీ

మాస్ మహారాజా రవితేజ అంటే తనకు ‘ఇడియట్’ రోజుల నుంచే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె ‘టచ్ చేసి చూడు’ సినిమాలో ఆయనకు తల్లిగా నటించే ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. లుక్ టెస్ట్ కోసం తెల్లటి విగ్గు ధరించి మేకప్ వేసుకున్నప్పటికీ.. రవితేజ ఆ సమయంలో డైట్‌తో బాగా సన్నబడటం, తాను వయసుకు మించిన హుందాతనంతో ‘కలెక్టర్‌’లా కనిపించడంతో ఆ పాత్ర సెట్ కాదని భావించి డ్రాప్ అయ్యారని సరదాగా వివరించారు.

ఒకప్పుడు సినీ పరిశ్రమలో అందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారని, ప్రస్తుతం ఆ ఆప్యాయతలు తగ్గిపోయాయని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో టీడీపీలో పనిచేసి, ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని తెలిపిన ఆమె.. రాజకీయాల్లో అయినా వెండితెరపైన అయినా ఎదుటివారిని ప్రసన్నం చేసుకుంటూ నడుచుకోవడం తనకు చేతకాదని కుండబద్దలు కొట్టారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడటం రాకపోవడం వల్లే కొన్ని అవకాశాలు తగ్గి ఉండవచ్చని, అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేనని, మంచి పాత్రలు వస్తే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని దివ్యవాణి స్పష్టం చేశారు.

వీరేష్ బిళ్ళ

రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్‌ స్టైల్ కథనాలు రాశారు. ఆయనకు హైపర్ లోకల్ న్యూస్ రాసిన అనుభవంతో పాటు వీడియో టీమ్ కోసం పని చేసిన అనుభవం కూడా ఉంది. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. వీరేశ్ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. గతంలో ఈనాడు.నెట్‌లో 7 ఏళ్లు పనిచేసిన ఆయన సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఆరేళ్లు సేవలందించారు. ప్రస్తుతం ‘సమయం తెలుగు’లోనే కన్సల్టెంట్‌‌గా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో ప్రకృతిలో సేద దీరడం, పుస్తకాలు చదవడం, పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుంటారు.… ఇంకా చదవండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *