Nandana: లుక్ అవుట్ నోటీసు రద్దు చేస్తే లండన్‌ వెళ్లిపోతా: యూట్యూబర్‌ నందన


ఇబ్రహీంపట్నం: ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రమానందన(YouTuber Nandana) ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట మంగళవారం హాజరయ్యారు. డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామంటూ మోసం చేశారని క్రాంతికుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో ఆమెకు స్థానిక పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. గత నెల 8న ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెను నాలుగు గంటల పాటు విచారించారు. ఈ నెల 16న  మరోసారి విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. న్యాయవాదుల సూచన మేరకు ఒక్కరోజు ముందుగానే ఆమె మంగళవారం పీఎస్‌కు చేరుకున్నారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజు నందనను విచారించారు.

గత విచారణలో ప్రశ్నించిన వాటినే పోలీసులు తిరిగి ప్రశ్నించగా దాటవేత సమాధానాలే రావడం గమనార్హం. కన్సల్టెన్సీ ఎవరి పేరుపై ఉంది? కన్సల్టెన్సీకి గల సంబంధం.. రిజిస్ట్రేషన్ చేసి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో పాటు గుంటూరులో ఉన్న కన్సల్టెన్సీకి, లండన్‌లో చేసిన వ్యాపారానికి గల సంబంధం ఏమిటీ..? ఎక్కడెక్కడ కన్సల్టెన్సీకి బ్రాంచీలు ఉన్నాయి, ఫిర్యాదు క్రాంతికుమార్ ఏ విధంగా తెలుసు? కేసు నమోదైన తర్వాత క్రాంతికుమార్‌తో జరిపిన సంభాషణ?  తదితర ప్రశ్నలను పోలీసు అడిగినా.. ఆమె సరైన సమాధానాలను ఇవ్వలేదని తెలుస్తోంది. గత విచారణ సందర్భంగా పోలీసుల అడిగిన కొన్ని ప్రశ్నలకు.. ఇవాళ లిఖిత పూర్వక  సమాధానం ఇచ్చినట్టు సమాచారం. తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసు రద్దు చేస్తే.. లండన్ వెళ్లిపోతానని, భర్త మధుకర్ భారత్‌కు రాగానే విచారణ చేయాలని న్యాయవాదుల ద్వారా పోలీసులను కోరినట్టు సమాచారం. ఆమె వినతిపై పోలీసులు న్యాయ సలహాతో ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

విహారయాత్రలో విషాదం.. సోకిలేరు వాగులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గల్లంతు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *