
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై కేంద్రం విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ (Windfall gains tax)ను తగ్గించింది. డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED) రేటు గతంలో లీటరుకు రూ.25.5 ఉండగా.. ప్రస్తుతం దాన్ని రూ. 24కు తగ్గించింది. ఏటీఎఫ్ ఎగుమతుల (ATF exports)పై ఎక్సైజ్ సుంకం రేటును లీటరుకు రూ. 22నుంచి రూ.19.5కు తగ్గించింది. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.3.5 ఉన్న సుంకాన్ని సున్నాకు పరిమితం చేసింది. ఆగస్టు 15 నుంచి రెండు వారాల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన లభ్యతను పెంచడానికి ప్రభుత్వం ఇటీవల విండ్‌ఫాల్ పన్ను విధించింది. ఇందులో భాగంగా మార్చి 27న డీజిల్, ఏటీఎఫ్‌లపై.. మే 16 నుంచి పెట్రోల్ ఎగుమతులపై ఎగుమతి సుంకాన్ని పెంచింది. నాటి నుంచి ఈ ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తోంది. ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన టోకు ధరలు












Leave a Reply