
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో వీబీజీ రాంజీ పనుల కింద కొనసాగుతున్న వ్యక్తిగత వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు (ఫాం పాండ్) నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు, పంటలకు అవసరమైన సాగునీటి లభ్యతకు వ్యవసాయ క్షేత్ర చెరువులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
అదే గ్రామానికి చెందిన రైతు సింగిని భిక్షపతి తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టడాన్ని కలెక్టర్ అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.













Leave a Reply