
ఒకప్పుడు హీరోయిన్లుగా చేసిన అక్కాచెల్లెళ్లు రాధ-అంబిక ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. తన గదిలో ఖాళీ చెక్కులు దొంగిలించి, దాదాపు రూ.50 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించారని నటి రాధ.. తన అక్క అంబిక, సోదరుడు మల్లిఖార్జున్పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ విషయంపై అంబిక స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో మోసపోయింది తానేనని తీవ్ర ఉద్వేగానికి లోనయింది. కమిషనరేట్లో రాధ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సంచలన విషయాలు వెల్లడించారు.
నిజానికి మోసపోయింది నేనే. నేనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. రాధకు ఎవరో తప్పుడు సలహా ఇచ్చారు. ఆమె ఎవరి ప్రభావంతో ఇలా చేసిందో నాకు తెలీదు కానీ ఆమెని చూస్తే జాలేస్తోంది. మేం కష్టపడి సంపాదించిన డబ్బులో సగం అమ్మకు ఇచ్చాం. ఏఆర్ఎస్ అనేది అంబికా దేవర్ ఫిలిమ్స్ కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తి, అది మేం కొన్న మొదటి ఆస్తి. కష్టకాలంలో ఆ కుటుంబానికి నేను అండగా నిలిచాను. దీని వెనక చాలా చరిత్ర ఉంది. ఈ వివాదానికి సంబంధించి కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నందున అన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడలేను అని అంబిక చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు కుటుంబం కోసం అందరం కలిసికట్టుగా ఆలోచించేవాళ్లమని.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోందని, సినిమా పరిశ్రమలో ఈ రోజు డబ్బు మాత్రమే ప్రధానమైపోయిందని ఎమోషనల్ అయ్యారు.












Leave a Reply