Bigg Boss Sudheer: ఏది జరిగినా మంచికే అంటారు కదా.. సుధీర్ రెడ్డి విషయంలో సృష్టి, త్రిగుణ్‌లుచేసిన నీఛమైన పనికి అతనికి మంచే జరిగింది. ఫ్రీడమ్ అన్న ఒక్క మాటని పట్టుకుని అతన్ని ఎన్ని విధాలుగా బ్లేమ్ చేయాలోచేశారు. అతన్ని అనరాని మాటలు అన్నారు. చివరికి చెత్తని తెచ్చి నెత్తిన పోయాల్సింది పోయింది.. అతని మొహంపై కొట్టి ఘోరంగా అవమానించారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత నీఛంగా అవమానించింది అయితే లేదు. మంగళవారం నాటి నామినేషన్స్‌లో ఈ దారుణానికి పాల్పడ్డారు త్రిగుణ్, సృష్టిలు.

ఏం మనిషివిరా సామీ.. దండంరా దూతా
నీ క్యారెక్టర్ గురించి మాట్లాడాడు.. అందుకే నీకు కోపం వచ్చింది.. సృష్టిలో ఇంకో యాంగిల్‌ని పూర్తిగా చూడాలని అనుకుంటున్నాను.. నువ్వు ఇంకా రెచ్చిపో అంటూ తెగ రెచ్చగొట్టాడు గుణం లేని త్రిగుణ్. అటు రోహిత్, ముకేష్‌లు గుణంలేని త్రిగుణ్ గురించి మాట్లాడుకుంటూ.. అతనివన్నీ శకుని మూవ్స్, ఏ అడుగు వేసినా కూడా శకునే అని అన్నాడు రోహిత్. ఫస్ట్ వీక్‌లో నాకు టార్చర్ చూపించాడు. గిన్నెలు వాష్ చేస్తుంటే.. చిన్న తడి ఉన్నా.. అలా చేయి ఇలా చేయి అంటూ కుకర్‌ని విసిరేసేవాడు. చాలా అవమానించేవాడు అని అన్నాడు రోహిత్. ఇక దేబ్జానీ దగ్గరకు వెళ్లిన రాం ప్రసాద్, నరేష్‌లు.. త్రిగుణ్ గురించే మాట్లాడుతూ.. ‘నేను నోరు విప్పితే కంపు కంపు అవుతుంది.. ఏదో ఆడపిల్ల కాబట్టి ఆగుతున్నా.. చాలా సెన్సిటివ్ పాయింట్స్ అని అన్నారు.
వాడు సేమ్ శకుని బ్రో.. రెచ్చగొట్టేస్తున్నాడు
త్రిగుణ్.. ఒక్కోసారి ఒక్కొక్కర్ని అస్త్రంగా వాడతాడు. ఇప్పుడు సృష్టిని ఆపరేట్ చేస్తున్నాడు. అందుకే సడెన్‌గా అలా బిహేవ్ చేస్తుంది. రెచ్చగొట్టేస్తున్నాడు.. అని ముకేష్ అంటే.. ‘సేమ్ వంశీని ఎలా ఆపరేట్ చేశాడో.. ఇప్పుడు సృష్టిని అలాగే చేస్తున్నాడు. సేమ్ టు సేమ్ శకుని బ్రూ.. డైరెక్ట్‌గా ఆడడు.. వెనకెనుక ఆడతాడు’ అని అన్నాడు రోహిత్. ఇక వాష్ రూం ఏరియాలో వర్షిణి, ముకేష్‌లు హగ్ చేసుకుని కనిపించారు. ఒకర్నొకరు ఓదార్చుకుంటూ. ఆ తరువాత నామినేషన్స్ ప్రక్రియ కంటిన్యూ అయ్యింది. మొదటిగా త్రిగుణ్‌తో ఈ ప్రక్రియను ప్రారంభించారు. అయితే నామినేట్ చేసే అవకాశం ముకేష్‌కి ఇచ్చారు. దాంతో చరణ్‌ని నామినేట్ చేశాడు ముకేష్. దాంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం నడిచింది.
పొడిచిందిగా పోటు..
ఇక చివరి రౌండ్‌లో భాగంగా వంశీకి కవర్స్ ఓపెన్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దాంతో షాలినికి నామినేట్ చేసే పవర్ దక్కింది. ఆమె రెండో ఆలోచన లేకుండా వర్షిణికి గుద్ది పడేసింది. అంతకు ముందే వాళ్లిద్దరి మధ్య పెద్ద గొడవ కావడంతో.. వర్షిణిని నామినేట్ చేసింది షాలిని. ‘స్క్రీన్‌లో కనిపించడం కోసం గొడవలు పెడుతున్నావ్.. వెనుకుండి ఆడిస్తున్నారు. సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావ్. నీకు నచ్చిన రూల్స్ పెట్టుకున్నావ్.. నీకు నచ్చిన వాళ్లకి ఫేవర్ చేశావ్ అని అన్నది షాలిని. దాంతో వర్షిణి.. ‘హౌస్‌లో టాస్క్‌లు ఒక్కటే గేమ్ కాదు.. ఎంటర్ అయినప్పటి నుంచి అన్నీ యాడ్ అవుతాయి. నేను రూల్స్ ఫాలో అవ్వకపోతే నువ్వేం పీకావ్’ అని గొడవకు దిగింది వర్షిణి.
ఏమమ్మా నీ బాధ.. సుధీర్ ప్లేస్‌లో వేరేవాడు ఉండి ఉంటే.. నీకు బొమ్మే
ఆ తరువాత రెండో నామినేషన్ తాను చేయకుండా సృష్టికి అవకాశం ఇచ్చింది షాలిని. అప్పుడు మొదలైంది అసలు రచ్చ. అందరూ ఊహించినట్టుగానే సుధీర్‌ని నామినేట్ చేసింది సృష్టి. నీ అవసరం కోసం వేరే వాళ్లని యూజ్ చేయొద్దు అని మొదలుపెట్టింది సృష్టి. నా దగ్గరకు వచ్చింది నువ్వు.. నాతో మాట్లాడింది నువ్వు.. నాతో పాటు తిరిగావ్.. నాతో ఉన్నావ్. కానీ సడెన్‌గా విసిరికొట్టావ్. అసలు నీపై నాకు ఇంట్రస్ట్‌లేదు’ అంటూ మళ్లీ ఓవరాక్షన్‌కి పోయింది సృష్టి. అయితే ఆమె మాట్లాడినంత సేపు చాలా ఓపిగ్గానే విన్నాడు సుధీర్. ఆ తరువాత కూడా ఓపికగానే సమాధానం చెప్పాడు.
నా బుద్ధి తక్కువయ్యి నీతో ఉన్నాను..
నేను ఏనాడూ ఆమె వెంటపడలేదు.. ఇబ్బంది పెట్టలేదు.. రాంగ్‌గా మాట్లాడలేదు అని సుధీర్ అంటే.. ‘మరి ఫ్రీడమ్ అని ఎందుకు అన్నావ్’ అని అంటూ అదో పెద్ద బూతులా కౌంటర్ ఇచ్చింది సృష్టి. దాంతో సుధీర్.. ‘ఆమె మొహం కూడా చూడకుండా.. నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడనిస్తే మంచిదని ఆ అమ్మాయి చెప్పండి అని అన్నాడు. కేవలం 14 రోజుల జర్నీలో నా పళ్లు రాలగొడతా అన్నావ్.. ఇడియట్ అన్నావ్.. మొహంపై వేలు పెట్టి మాట్లాడావ్. ప్రతిసారి నేనే వచ్చి మాట్లాడా అని అంటున్నావ్.. మరి నువ్వెందుకు రెస్పాండ్ అయ్యావ్? నా ఇన్నాళ్ల జీవితంలో నేను ఏ అమ్మాయితో ఇన్ని మాటలు పడలేదు. ఆ అమ్మాయి గేమ్ ఆమె ఆడుకోవాలి. ఒక మ్యానిప్యులేటర్ వల్ల ఇలా జరిగింది.
అసలు నువ్వు మనిషివేనా?? ఛీఛీ..
నా బుద్ధి తక్కువయ్యి.. ఆమెతో క్లోజ్‌గా ఉన్నాను. ఫ్రీడమ్ అనే మాటని పెద్ద బూతులు చూస్తున్నారు. ఫ్రీడమ్ అంటే నా గేమ్‌పై ఫోకస్ పెడతా అని తప్పితే మరో ఉద్దేశం కాదు అని చేతులెత్తి దండం పెట్టేశాడు సుధీర్. ఇంతలో వాళ్లిద్దరి మధ్యలోకి దూరిపోయాడు గుణం లేని త్రిగుణ్. చివరికి నువ్వు చేసింది తప్పు.. అది ఒప్పుకోకపోతే మీది కూడా తప్పే అంటూ అడ్డదిడ్డంగా వాదించిన సృష్టి.. సుధీర్‌పై చెత్తని కుమ్మరిస్తూ పిచ్చెక్కినట్టు ప్రవర్తించింది. చివర్లో చెత్తని అతని మొహంపై విసిరికొట్టింది. సుధీర్ ప్లేస్‌లో వేరే వాడు ఉండి ఉంటే.. ఎగిరి తన్నేవాడు కానీ.. అతను మాత్రం చాలా హుందాగా స్పందించాడు.
ఇలాంటి వాళ్లు ఉండాల్సింది బిగ్ బాస్ హౌస్‌లో కాదు.. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో
జీవితంలో మనకి చాలా దుమ్ము దూళి తగులుతాయి.. అందుకే స్నానం చేస్తాం. తప్పేం కాదు అంటూ చెప్పుతో కొట్టినట్టు చేశాడు సుధీర్. అయితే నీఛాతి చీఛంగా సుధీర్‌పై చెత్తని విసిరికొడుతుంటే.. అక్కడున్న వాళ్లంతా మానవత్వంతో అయ్యో పాపం అన్నట్టుగా చూశారు. చూసే ఆడియన్స్ కూడా అయ్యో అనుకున్నారు. కానీ అక్కడున్న గుణం లేని త్రిగుణ్ మాత్రం చప్పట్లు కొట్టి.. అసలు వీడు మనిషేనా? అన్నట్టుగా ప్రవర్తించాడు. సుధీర్ నామినేషన్స్‌లో ఈ ప్రక్రియ ముగిసినట్టుగా ప్రకటిస్తూ.. ఈవారం నామినేషన్స్‌లో నిలిచిన వాళ్ల లిస్ట్ చదివారు బిగ్ బాస్. వంశీ, సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, వర్షిణి.. ఈ ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నట్టుగా ప్రకటించారు బిగ్ బాస్.















Leave a Reply