Kavya Maran – Anirudh Ravichander: కావ్యా మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం


ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ (Anirudh Ravichander), సన్‌ పిక్చర్స్‌ అధినేత కళానిధి మారన్‌ కుమార్తె కావ్యా మారన్‌ (Kavya Maran)ల వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు చెన్నైలో నవంబరు 21న జరగనున్న తమ కుమార్తె కావ్యా మారన్‌ – అనిరుధ్‌ రవిచందర్‌ వివాహ విందుకు రావాల్సిందిగా సన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌ దంపతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి దంపతులను వారు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. 

కేటీఆర్‌కు ఆహ్వానం 

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దంపతులను కళానిధి మారన్, ఆయన సతీమణి హైదరాబాద్‌లో కలిశారు. నవంబరు 21న చెన్నైలో జరగనున్న వివాహ విందుకు హాజరవ్వాల్సిందిగా కోరారు.

అనిరుధ్‌, కావ్య కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. అప్పట్లో ఈ ప్రచారాన్ని అనిరుధ్‌ ఖండించారు. నవంబరు 10 – 11 తేదీల్లో గ్రీస్‌ వేదికగా వీరి వివాహం జరగనున్నట్లు తాజాగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *