VVS Laxman: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం | క్రీడా వార్తలు


Last Updated:

ఆసియా క్రీడలు 2026 కోసం భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యారు. గౌతమ్ గంభీర్ వేరే సిరీస్‌లతో బిజీగా ఉండటంతో, లక్ష్మణ్‌కు ఈ కీలక బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది.

News18
News18

జపాన్ వేదికగా జరగనున్న 2026 ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్ జట్టును బీసీసీఐ సన్నద్ధం చేస్తోంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్, మాజీ దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం భారత రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రధాన జాతీయ జట్టుతో పాటు ఇతర ముఖ్యమైన సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆసియా క్రీడలు కూడా జరగనుండటంతో గంభీర్ స్థానంలో లక్ష్మణ్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని క్రికెట్ బోర్డు నిర్ణయించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *